మనసు మార్చుకున్న ట్రంప్..

63

దిశ, వెబ్ డెస్క్:

హెచ్-1బీ వీసా నిబంధనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో వీసా నిబంధనలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తామని చెప్పిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గారు.

ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసా నిబంధనలను ట్రంప్ సర్కార్ సడలించింది. దీని ప్రకారం హెచ్-1బీ వీసా నిషేధం కన్నా ముందు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారికి తిరిగి అనుమతి ఇస్తామని ప్రకటించింది.

తిరిగి ఆ ఉద్యోగాల్లోనే చేరేందుకు అమెరికా వస్తే అనుమతినిస్తామని స్పష్టం చేసింది. హెచ్-1బీ, ఎల్ 1 వీసాలు ఉన్నవారికే ఇది వర్తిస్తుందని ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..