డ్రాగన్‌తో ప్రపంచానికే ముప్పు

by  |
డ్రాగన్‌తో ప్రపంచానికే ముప్పు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చైనాపై విమర్శలు గుప్పించారు. కరోనా విషయంలో సందు దొరికినప్పుడల్లా చైనాపై ధ్వజమెత్తడం ట్రంప్‌కు పరిపాటిగా మారింది. తాజాగా అమెరికాతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితులకు చైనానే కారణమంటూ ట్వీట్ చేశారు. కరోనా విషయంలో చైనా గోప్యత పాటించడం వల్లే ప్రపంచ దేశాలకు ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. కాగా, అమెరికాలో మరోసారి పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదు అవుతుండటంతో అందుకు చైనానే కారణమని ట్రంప్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed