- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ : బస్సును ఢీకొన్న భారీ ట్రక్కు.. 18 మంది మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆగి ఉన్న బస్సును భారీ ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 18 మంది మృతి చెందగా, 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో మంగళవారం అర్థరాత్రి దాటాక వెలుగుచూసింది. మృతులంతా బీహార్‌కు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. అతివేగంగా ట్రక్కును డ్రైవ్ చేయడం వల్లే అదుపుతప్పి బస్సును ఢీకొట్టినట్లు స్థానికుల సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆగి ఉన్న బస్సును భారీ ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 18 మంది మృతి చెందగా, 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో మంగళవారం అర్థరాత్రి దాటాక వెలుగుచూసింది. మృతులంతా బీహార్‌కు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది.
అతివేగంగా ట్రక్కును డ్రైవ్ చేయడం వల్లే అదుపుతప్పి బస్సును ఢీకొట్టినట్లు స్థానికుల సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేయడమే కాకుండా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Next Story






