- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్.. కరీంనగర్‌లో కారు జోరు.. రెండు స్థానాలు కైవసం

X
దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్‌లోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. కరీంనగర్ SRR కాలేజీలో జరుగుతున్న కౌంటింగ్‌లో ఇప్పటి వరకు జరిగిన లెక్కింపుతో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాదరావులు స్పష్టమైన మెజార్టీ సాధించారు. టి భాను ప్రసాదరావుకు 584, ఎల్ రమణకు 479, సర్దార్ రవిందర్ సింగ్‌కు 231 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో రాగా, 17 ఓట్లు చెల్లలేదు. ఉమ్మడి జిల్లాలో 1,324 ఓట్లకు గాను 1,320 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మూడో వంతు ఓట్లు వచ్చిన వారిని విజేతలుగా ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరికి కూడా మూడో వంతు మెజార్టీ దాటడంతో మరికొద్ది సేపట్లో ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటన వెలువరించనున్నారు.
బ్రేకింగ్.. ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ భారీ విజయం.
- Tags
- Karimnagar
Next Story