- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య స్థానంలో కూర్చున్న భర్త.. కొమురవెల్లి ఆలయంలో ఘటన
by Shyam |
<p>దిశ, మెదక్: జిల్లాలో సతులకు బదులు పతులదే పెత్తనం కొనసాగుతున్నది. కేటీఆర్ పలు మార్లు హెచ్చరించినా.. వీరి తీరు మారడం లేదు. దీనిపై అనేక సందర్భాల్లో దిశ పలు కథనాలను ప్రచురించింది. తాజాగా కొమురవెల్లి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీకి బదులు ఆమె భర్త పాల్గొనడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 9, 10, 11 తేదీలలో ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆలయ చైర్మన్, డైరెక్టర్లు విలేకరుల […]</p>

X
దిశ, మెదక్: జిల్లాలో సతులకు బదులు పతులదే పెత్తనం కొనసాగుతున్నది. కేటీఆర్ పలు మార్లు హెచ్చరించినా.. వీరి తీరు మారడం లేదు. దీనిపై అనేక సందర్భాల్లో దిశ పలు కథనాలను ప్రచురించింది. తాజాగా కొమురవెల్లి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీకి బదులు ఆమె భర్త పాల్గొనడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 9, 10, 11 తేదీలలో ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆలయ చైర్మన్, డైరెక్టర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ కీర్తనకు బదులు ఎంపీపీ భర్త తలారి కిషన్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
Next Story






