ఇదేనా నేర్చుకున్నది.. గ్రాడ్యుయేట్లపై వాణీదేవి ఫైర్

by  |
TRS MLC candidate Surabhi Vani Devi
X

దిశ, తెలంగాణ బ్యూరో: చదువుకున్నవారు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు సరిగా వేయలేకపోయారు.. ఇదేనా? చదువుకున్న తర్వాత నేర్చుకుందని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఓట్ల కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటు వేసిందంతా డిగ్రీలు, పీహెచ్‌డీ, పీజీలు చేసిన వారేనని, కానీ ఈ ఎన్నికల్లో 21వేల మంది ఓట్లు చెల్లనివిగా మారాయంటే బాధేస్తోందన్నారు. ఇవేనా మన చదువులు? చదువుకున్న వారు ఇట్లాగేనా? ఓటు వేసేదని ప్రశ్నించారు. అంతా మామూలు వారు కాదు… అంతా చదువుకున్నారు.. ఉద్యోగాలు కూడా చేస్తున్నారు… కానీ ఓటు వేయడం రాదా? అని ప్రశ్నించారు. మనం మన విద్యాప్రమాణాలను పెంచుకోవాలని ఈ పరిణామం తెలియజేస్తోందన్నారు. 30 ఏళ్లుగా టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న.. చెల్లని ఓట్లను చూసి సిగ్గుపడుతున్నా.. ఇప్పడు బోధనా సిబ్బందిగా మమ్మల్ని మేం ప్రశ్నించుకుంటామని ఆవేదన వ్యక్తంచేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగుతోందని, గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. సెకండ్ ప్రయారిటీ ఓట్లు వస్తాయని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. తనకున్న గుర్తింపు, టీఆర్ఎస్ పార్టీ పలుకుబడి తన గెలుపునకు కారణమని వ్యాఖ్యానించారు.


Next Story