- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆర్థిక మాంద్యంలో అద్భుత బడ్జెట్’
<p>దిశ, న్యూస్ బ్యూరో: ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామని టీఆర్ఎస్ నేతలు అన్నారు. బడ్జెట్ అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సుంకె రవిశంకర్, నోముల నరసింహాయ్య, గువ్వల బాలరాజు, జీవన్ రెడ్డి బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేశారు. వాస్తవిక దృక్పథంతో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బడుగు బలహీన […]</p>

దిశ, న్యూస్ బ్యూరో: ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామని టీఆర్ఎస్ నేతలు అన్నారు. బడ్జెట్ అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సుంకె రవిశంకర్, నోముల నరసింహాయ్య, గువ్వల బాలరాజు, జీవన్ రెడ్డి బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేశారు. వాస్తవిక దృక్పథంతో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమానికి ప్రధాన్యత ఇచ్చామన్నారు. తమ మేనిఫెస్టో ఇచ్చిన హామీలు చేసేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు.
tag: trs mlas, comments, budget, telangana






