- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంచులు మోసి పదవులు తెచ్చుకుంది నువ్వు కాదా రేవంత్ : ఎమ్మెల్యే లింగయ్య
<p>దిశ, తెలంగాణ బ్యూరో : నీతి నిజాయితీ లేని కుక్క రేవంత్ రెడ్డి అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్‌ఎల్పీలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డికి పదవులు, డబ్బే ముఖ్యమని ఆరోపించారు. ఆయనకు ప్రయాణాలు, ప్రజాసేవ అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రజా సంక్షేమం, కార్యక్రమాలను చూసి రేవంత్‌కు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు. ఆయన బెదిరింపులు, బ్లాక్ మెయిల్ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : నీతి నిజాయితీ లేని కుక్క రేవంత్ రెడ్డి అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్‌ఎల్పీలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డికి పదవులు, డబ్బే ముఖ్యమని ఆరోపించారు. ఆయనకు ప్రయాణాలు, ప్రజాసేవ అవసరం లేదన్నారు.
సీఎం కేసీఆర్ చేసిన ప్రజా సంక్షేమం, కార్యక్రమాలను చూసి రేవంత్‌కు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు. ఆయన బెదిరింపులు, బ్లాక్ మెయిల్ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. సంచులు మోసి పదవులు తెచ్చుకున్నావని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన గౌరవం ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో తగిన రీతిలో వాత పెడతారని అన్నారు.
సీఎం కేసీఆర్ దళితుల కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే కాంగ్రెస్‌కు కడుపు మంట ఎందుకని విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి.. సీఎం కేసీఆర్‌పై పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే గురుకులాలకు సేవలందించారని అలాంటి వ్యక్తి పైనే విమర్శలు చేయడం శోచనీయమన్నారు. ప్రవీణ్ కుమార్ కూడా రాజకీయంగా మరో జయ ప్రకాష్ నారాయణ అవుతారని ఎద్దేవా చేశారు.






