అయ్యో ‘రామా..’ ఖర్చాయే.. పబ్లిసిటీ కాదాయే..!

by  |
అయ్యో ‘రామా..’ ఖర్చాయే.. పబ్లిసిటీ కాదాయే..!
X

దిశ,వెబ్‌డెస్క్: ….తొందర పడి ఓ కోయిల ముందే కూసింది..విందులు చేసింది అన్న పాటను నిజం చేశారు టీఆర్ఎస్‌లో ఓ కీలక నాయకుడు. కేటీఆర్ సీఎం అయి వస్తే స్వాగతం పలకాలని ముందస్తుగానే బ్యానర్లు, ఫ్లెక్సీలు సరంజామా అంతా ముందే సిద్దం చేసుకున్నారు. స్వాగతం మాములుగా ఉండవద్దనుకున్నారో…లేక అందరి కన్నా ముందే ఆయన దృష్టిలో తానే పడాలనుకున్నారో ఏమో తెలియదు కానీ…భారీగానే ఏర్పాట్లు చేసుకున్నారు.

ఆదివారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేటీఆర్‌ను సీఎం చేయగానే తన సత్తా ఏంటో చూపిద్దాం అనుకున్నట్టు ఉన్నారు. కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటీ…సీఎం కేసీఆర్ తాజా ప్రకటనతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఫ్లెక్సీలు కాస్త మూలకు పడడంతో సోషల్ మీడియాలో ఫ్లెక్సీలు వైరల్‌గా మారాయి. అయితే ఆ మూలకు పడ్డ ఫ్లెక్సీలపై కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ మంత్రి , ఆయన కుమారాడు ఫోటోలు ఉండటం గమనార్హం.



Next Story