కైట్ ఎగురవేస్తూ టీఆర్ఎస్ నాయకుడు మృతి

226

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ పూట హైదరాబాద్ చిక్కడపల్లి‌లో విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కిందపడి టిఆర్ఎస్ నాయకులు బంగారు కృష్ణ మృతి చెందారు. సాయంత్రం మూడో అంతస్తు లో గాలిపటం ఎగురవేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాలిపటాన్నే చూస్తు వెనక్కి జరిగిన క్రమంలో అదుపు తప్పి భవనం మీద నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయల పాలైన కృష్ణ ను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా తీవ్ర రక్త స్రావం కావడంతో మార్గమధ్యలోనే మృతి చెందాడు. సంతోషంగా పండుగ నిర్వహించుకుంటున్న సమయంలో బంగారు కృష్ణ మృతి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.