నిఘా వర్గాల నివేదికలో టీఆర్ఎస్‌‌కు బిగ్ షాక్

by  |
trs leader
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓట్లతో మమేకమైన ప్రతి విషయంలోనూ అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నట్టున్నాయి. హుజురాబాద్ బై పోల్స్ తరువాత ఈ పరిస్థితి మరీ తీవ్రం అయింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లోనూ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అధికార పార్టీకి వ్యతిరేకంగా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు నిఘా వర్గాలు కూడా నివేదిక అందించడం గమనార్హం.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 1324 మంది స్థానిక సంస్థల ఓటర్లలో చాలా మంది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఆ నివేదికల సారాంశం. ప్రధానంగా మంథని, పెద్దపల్లి, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్ నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పోలయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా కొంతమేర వ్యతిరేత ప్రభావం ఉన్నప్పటికీ ఆయా సెగ్మెంట్ల ఇన్‌చార్జీల కారణంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీకి అనుకూలంగా ఉన్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఏకగ్రీవం అయితే బెటర్..

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏకగ్రీవం అయితేనే బావుంటుందని టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఊహించని విధంగా 27 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అందులో 24 మంది స్క్రూటినీ తరువాత మిగిలారు. వీరందరిని మేనేజ్ చేసి పోటీ నుండి తప్పిస్తే యూనానిమస్ చేసుకుంటే బావుంటుందని పార్టీ పెద్దలు యోచిస్తున్నారు. ఈ కారణంగానే నామినేషన్లు వేసిన వారందరితో మాట్లాడేందుకు అధిష్టానం ప్రత్యేకంగా కొంతమందికి బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.


Next Story