TRS భారీ స్కెచ్.. నామినేషన్ వేయాలని రాజేందర్‌పై ఒత్తిడి

by  |
TRS భారీ స్కెచ్.. నామినేషన్ వేయాలని రాజేందర్‌పై ఒత్తిడి
X

దిశ ప్రతినిది, కరీంనగర్: హుజురాబాద్ వేదికగా మరో ఎత్తుగడకు టీఆరెఎస్ పార్టీ వ్యూహం రచించినట్టుగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో ఈటల ఓటమిని నిలువరించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో మరో వ్యూహంతో పావులు కదపినట్టుగా అర్థం అవుతోంది. తాజాగా ఇల్లందుల రాజేందర్, ప్రశాంత్ లు చెప్తున్న విషయాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. హుజురాబాద లోని దమ్మక్కపేటకు చెందిన ఇల్లందుల రాజేందర్ ఈ రోజు తన పిల్లలను స్కూళ్లో దింపేందుకు వెళ్తుండగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు తన వద్దకు వచ్చి నామినేషన్లు వేయాలని తనను అడిగారని వివరించారు. దీంతో తాను నామినేషన్ వేయలేనని చెప్పి తన తమ్మున్ని తీసుకుని వచ్చానని తెలిపారు. ఆయన సోదరుడు ఇల్లందుల ప్రశాంత్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ నాయకులు తన అన్నచే నామినేషన్ వేయించేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంప్రదించారన్నారు. అయితే తనకు అనుమానం వచ్చి మీడియాను కలిశానని తెలిపారు. ఈటల రాజేందర్, ఇల్లెందుల రాజేందర్ పేర్లు సరితూగుతుడడం వల్లే టీఆర్ఎస్ నాయకులు ఈ ప్రయత్నం చేశారన్నారు.

సెలువు రోజులు..

దసరా పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలువులను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇల్లందుల రాజేందర్ గురువారం ఉదయం తన పిల్లలను స్కూళ్లో దింపేందుకు వెల్తుండగా టీఆర్ఎస్ కార్యాకర్తలు వచ్చి నామినేషన్ వేసేందుకు తనను సంప్రదించాలని చెప్తుండడం గమనార్హం.


Next Story

Most Viewed