మాఫీలు ‘గ్రేటర్ పీఠం’ కోసమేనా?

by Shyam |   (  Updated:2020-11-16 00:51:26  IST  )

<p>దిశ‌, తెలంగాణ బ్యూరో : ప్రసన్నానికి వేళైంది.. గాలమేయడానికి సమయం ఆసన్నమైంది.. గ్రేటర్​ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సర్కార్​ తాయిలాలు ప్రకటిస్తోంది. ఏ అవకాశాన్ని వదులుకునేది లేదన్నట్టుగా వరాల జల్లు కురిపిస్తోంది. గ్రేటర్​పీఠాన్ని మళ్లీ చేజిక్కుంచుకునే ఎత్తుగడలో భాగంగానే, ఓటర్ల ప్రసన్నమే లక్ష్యం అన్నట్టుగా ఆఫర్లు ప్రకటిస్తోంది. మంత్రి కేటీఆర్​ ప్రాపర్టీ ట్యాక్స్ లోని సగం రాయితీని ప్రకటించడం, గ్రేటర్​ ఉద్యోగులకు వేతనాలు పెంచడం వంటివి చూస్తుంటే అలాగే అనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. త్వరలోనే నీటి బిల్లులూ [&hellip;]</p>

మాఫీలు ‘గ్రేటర్ పీఠం’ కోసమేనా?
X

దిశ‌, తెలంగాణ బ్యూరో : ప్రసన్నానికి వేళైంది.. గాలమేయడానికి సమయం ఆసన్నమైంది.. గ్రేటర్​ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సర్కార్​ తాయిలాలు ప్రకటిస్తోంది. ఏ అవకాశాన్ని వదులుకునేది లేదన్నట్టుగా వరాల జల్లు కురిపిస్తోంది. గ్రేటర్​పీఠాన్ని మళ్లీ చేజిక్కుంచుకునే ఎత్తుగడలో భాగంగానే, ఓటర్ల ప్రసన్నమే లక్ష్యం అన్నట్టుగా ఆఫర్లు ప్రకటిస్తోంది. మంత్రి కేటీఆర్​ ప్రాపర్టీ ట్యాక్స్ లోని సగం రాయితీని ప్రకటించడం, గ్రేటర్​ ఉద్యోగులకు వేతనాలు పెంచడం వంటివి చూస్తుంటే అలాగే అనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. త్వరలోనే నీటి బిల్లులూ మాఫీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఏళ్లుగా చేయని పనులు ఈ వేళ చేస్తుండడంతో సగటు హైదరాబాద్ వాసి ఆలోచనలో పడ్డాడు. ఎన్నికల వరాలు ఇప్పుడే షురూ చేశారని పలువురు పేర్కొంటున్నారు.

నగరంలో గ్రేట‌ర్ ఎన్నిక‌ల వాతావర‌ణం ఊపందుకుంది. ఈ వారంలోనే నోటిఫికేష‌న్ వెలువ‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఈలోపే ఎన్నిక‌ల వ్యూహాల‌ను అమ‌లు చేసేందుకు అధికార పార్టీ వేగంగా ముందుకు క‌దులుతోంది. దీపావళి కానుకగా గ్రేట‌ర్ ప‌రిధిలోని ట్యాక్స్ పేయ‌ర్స్‌కు భారీ ఆఫ‌ర్ ప్రకటించారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్రాప‌ర్టీ ట్యాక్స్​ను పూర్తిగా మాఫీ చేస్తార‌ని భావించినా, 50 శాతం రాయితీని ఇస్తూ పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో 15,32,008 మంది ప్రాప‌ర్టీ ట్యాక్స్​ చెల్లింపుదారులున్నారు. వారంద‌రికీ ఈ నిర్ణయంతో మేలు క‌ల‌గ‌నుంది. 15,81,898 నివాస భ‌వ‌నాల చెల్లింపుదారులకు రూ.397.74 కోట్లు రాయితీగా వ‌స్తోంది. 16,825 మిక్స్‌డ్‌, 13,32,285 నాన్ రెసిడెన్షియల్​ ప్రాప‌ర్టీ ట్యాక్స్​ పేయ‌ర్స్‌కు కూడా ఈ నిర్ణయంతో ప్రయోజనం కలుగనుంది. ఈ నిర్ణయంతో గ్రేట‌ర్ ప‌రిధిలోని మొత్తం ట్యాక్స్​ చెల్లింపుదారుల‌కు రూ.483.52 కోట్ల మేర భారం త‌ప్పనుంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల న‌జ‌రానాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల మ‌రో తాయిలంగా నీటి బిల్లుల‌ను కూడా మాఫీ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మొత్తంగా బకాయిలు ర‌ద్దు చేస్తారా, ఏదైనా ప‌రిమితి విధిస్తారా అనేది కొన్ని రోజుల్లో తేలాల్సి ఉంది.

బ‌ల్దియాలో జీతాల పెంపు..

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప‌నిచేస్తున్న కార్మికుల‌కు జీతాలు పెంపు చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శానిటేష‌న్ విభాగంలోని శానిటేష‌న్ ప‌బ్లిక్ హెల్త్ వర్కర్స్​, ఫీల్డ్​ సిబ్బందికి రూ.14 వేల నుంచి రూ.17వేల‌కు, హెల్త్ ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.3 వేలు పెంచుతూ శ‌నివారం ఎంఏయూడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీలో 18 వేల మందికి ప్రయోజనం క‌ల‌గ‌నుంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అధికార పార్టీ వ‌రుస‌గా తాయిలాలు ప్రకటిస్తోంది. వ‌ర‌ద సాయం అంద‌జేత కార్యక్రమం కూడా ఎన్నికల డబ్బుల కార్యక్రమంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ త‌ర్వాత భారీ స్థాయిలో ఓటర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటించడం ఇదే తొలిసారి. ట్యాక్స్​ చెల్లింపుదారులతో పాటు సాధార‌ణ కుటుంబాల ఓటర్లకు కూడా న‌జ‌రానా సిద్ధంగా ఉన్నట్టు స‌‌మాచారం. న‌గ‌రంలోని నీటి బిల్లుల బ‌కాయిల‌ను సైతం మాఫీ చేసే యోచ‌న‌లో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story