షమీపై ట్రోల్స్‌ మొదలైంది పాకిస్థాన్ నుంచే..!

100

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్-2021లో భాగంగా గత ఆదివారం దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్‌లో తొలిసారిగా భారత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ ముగిసి మూడ్రోజులు అవుతున్నా ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ చేస్తూ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా షమీని టార్గెట్ చేసుకుని తీవ్ర పదజాలంతో అతన్ని ట్రోలింగ్ చేశారు.

అయితే, ఈ ట్రోలింగ్ పాకిస్థాన్ నుంచే మొదలైందని తెలుస్తోంది. ఈ ట్రోల్స్ అన్నీ పాకిస్థాన్‌కి చెందినవారే చేసినట్లు సమాచారం. ఈ మేరకు ట్విట్టర్‌లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కావాలనే విద్వేషం వెదజల్లాలనే కారణంతోనే.. ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఓ వర్గానికి చెందిన క్రికెటర్ అయిన షమీపై ఆన్‌లైన్‌లో వేధింపులకు గురి చేశారని.. 8 మంది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను గుర్తించారని.. వాటి నుంచే ఈ ఫేక్ ప్రచారం మొదలైందని గుర్తించినట్లు తెలుస్తోంది.

మరోవైపు షమీకి మద్దతుగా భారత సీనియర్ క్రికెటర్లు నిలుస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, యుజ్వేంద్ర చాహల్ వంటి వాళ్లు షమీకి బాసటగా నిలిచారు. ఇక తాజాగా క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా షమీకి మద్దతుగా నిలుస్తూ షమీని ట్రోల్ చేస్తున్న వారికి ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..