ఫుల్ జోష్‌లో విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్’.. కీలక పనులు పూర్తి

by Pulgam srinivas |

‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’ సినిమాకు సంబంధించిన టీజర్ డబ్బింగ్ పనులను విజయ్ సేతుపతి పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఫుల్ జోష్‌లో విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్’.. కీలక పనులు పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను జూన్ 8న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టీజర్‌కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. తాజాగా విజయ్ సేతుపతి టీజర్‌కు డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ విడుదల కాకపోయినా మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

రేపు విడుదల కానున్న టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్‌పై, జె.బి. నారాయణరావు కొండ్రోళ్ల (జె.బి. మోషన్ పిక్చర్స్) సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటి టబు, సంయుక్త, దునియా విజయ్ కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

Next Story