- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రదీప్ రంగనాథన్‌కు బంపర్ ఆఫర్.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా ఫిక్స్?
ప్రదీప్ రంగనాథన్ దర్శకుడు అట్లీ నిర్మాణంలో తెరకెక్కబోయే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘కోమలి’, ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న ఆయనకు కొంతకాలం క్రితం ‘LIK’ సినిమా ద్వారా నిరాశ ఎదురైంది. అయినప్పటికీ ప్రదీప్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వరుసగా భారీ నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు అందుకుంటూ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ బ్యానర్లలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రదీప్, తాజాగా మరో స్టార్ డైరెక్టర్ నిర్మాణంలో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ నిర్మించనున్న ఓ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇలా స్టార్ ప్రొడక్షన్ హౌస్‌లలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ప్రదీప్ జెట్ స్పీడ్‌తో ముందుకు దూసుకుపోతున్నాడు.






