CBSE 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రీ-ఇవాల్యుయేషన్ దరఖాస్తుకు నేడే ఆఖరు

by Kema Shiva Kumar |

సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు చివరి అవకాశం. మార్కుల పున:పరిశీలన (Re-evaluation) దరఖాస్తుకు నేడే ఆఖరి తేదీ కానుంది.

CBSE 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రీ-ఇవాల్యుయేషన్ దరఖాస్తుకు నేడే ఆఖరు
X

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షల మార్కుల రీ-ఇవాల్యుయేషన్ (Re-evaluation), మార్కుల వెరిఫికేషన్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. ఇటీవలే విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలలో తమకు వచ్చిన మార్కులపై అసంతృప్తి, సందేహాలు ఉన్న విద్యార్థులకు బోర్డు కల్పించిన ఈ దరఖాస్తు విండో ఇవాళ అర్ధరాత్రితో క్లోజ్ కానుంది. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in సందర్శించి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

అయితే, నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ దరఖాస్తులను ఆమోదించబోమని, ఆఫ్‌లైన్ దరఖాస్తులకు వీలులేదని సీబీఎస్‌ఈ ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి మార్కుల రీ-ఇవాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మార్కుల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, అవసరమైతే విద్యార్థులు తమ జవాబు పత్రాల (Answer Sheets) ఫోటోకాపీల కోసం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండనుంది.

Next Story