- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ నిధుల మళ్లింపు కుంభకోణం.. అధికారుల ఇళ్లపై సీబీఐ మెరుపు దాడులు
ప్రభుత్వ శాఖల నిధుల మళ్లింపు కుంభకోణంలో సీబీఐ (CBI) సంచలన దాడులు నిర్వహించింది.

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా ప్రభుత్వం, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన పలు ప్రభుత్వ శాఖల నిధులను భారీగా మళ్లించిన కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఆరు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో ముమ్మర సోదాలు నిర్వహించారు.
10 ప్రభుత్వ శాఖల సొమ్ము లూటీ..
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank)ల ద్వారా జరిగిన ఈ భారీ బ్యాంక్ మోసానికి సంబంధించి సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. హర్యానా ప్రభుత్వానికి చెందిన 8 విభాగాలు, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన మున్సిపల్ కార్పొరేషన్, క్రెస్ట్ (CREST) వంటి 2 విభాగాల ప్రభుత్వ నిధులను అక్రమంగా మళ్లించి సేకరించినట్లు విచారణలో తేలింది. చండీగఢ్, పంచకుల, ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని ఆరు ప్రాంగణాల్లో ఈ సోదాలు జరిగాయి. వీటిలో హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారుల (Public Servants) నివాసాలతో పాటు, ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెసర్స్ విపామ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం, దాని డైరెక్టర్ ఇళ్లలో కూడా సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే, అక్రమ సొమ్ము చేతులు మారడం, నిధుల దుర్వినియోగంపై కీలక ఆధారాలు లభించినట్లుగా సీబీఐ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిధులను మళ్లించడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు, సదరు ప్రైవేట్ బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై నకిలీ లేదా అక్రమ పద్ధతుల్లో ఖాతాలు తెరిచారని, ఆపై నిధులను ట్రాన్స్‌ఫర్ చేసి దుర్వినియోగానికి పాల్పడ్డారని దర్యాప్తులో వెల్లడైంది.






