రోడ్డుపై నిలిచిన వడ్ల లారీలు.. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు!

by Jakkula.Mamatha |

వడ్ల ధాన్యం లోడ్‌తో రోడ్ల పై లారీలు గంటలు రోజుల తరబడి నిలుస్తున్నాయి.

రోడ్డుపై నిలిచిన వడ్ల లారీలు.. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు!
X

దిశ, మంథని: వడ్ల ధాన్యం లోడ్‌తో రోడ్ల పై లారీలు గంటలు రోజుల తరబడి నిలుస్తున్నాయి. మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలో ఉన్న రైస్ మిల్లుకు ధాన్యం వడ్ల లారీలు క్యూలైన్‌లో పదుల సంఖ్యలో లారీలు నిలుస్తున్నాయి. రోజుల తరబడి రోడ్లపై నిలిపివేయడంతో డ్రైవర్లు ధాన్యం మిల్లులో దింపే వరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. కాగా రోజుల తరబడి ఒక వైపు పదుల సంఖ్యలో లారీలు నిలపడం వలన మంథని నుండి సూరయ్యపల్లి, కాకర్లపల్లి, రచ్చపల్లి ఇతర గ్రామాలకు వెళ్లే వాహనదారులు, బాటసారులు వన్ వే లో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు వాపోతున్నారు. వీటి వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనిపియడం లేదని అంటున్నారు. దీంతో రాత్రి వేళలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Next Story