- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ రంజన్ (Tanuja Ranjan) హత్య, దోపిడీ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు (Jubilee Hills) దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితులను కోర్టు అనుమతితో పోలీసులు ఇవాళ తమ కస్టడీలోకి తీసుకున్నారు. హత్య, భారీ దోపిడీకి పాల్పడిన ప్రధాన నిందితుడు సునీల్ పరియార్ (Sunil Pariyar)తో పాటు, దొంగిలించిన బంగారు ఆభరణాలను ముంబైలో కొనుగోలు చేసిన రిసీవర్ దిలీప్(Receiver Dileep)ను పోలీసులు 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పెట్టి ఉన్నతాధికారులు ముమ్మరంగా విచారిస్తూ వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఈ ఇన్వెస్టిగషన్‌లో భాగంగా దోపిడీకి గురైన మిగిలిన సొత్తు ఎక్కడ దాచారు? ఈ దారుణంలో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముంబైలో దిలీప్ కొనుగోలు చేసిన ఆభరణాలకు సంబంధించిన వివరాలను సేకరించి, వాటిని పూర్తి స్థాయిలో రికవరీ చేసేందుకు దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. కస్టడీ గడువు ముగిసిన తర్వాత నిందితులను తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు.
కాగా, మే 8 తెల్లవారుజామున తన నివాసంలోనే తనూజ రంజన్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆమె చేతులు కట్టి, నోట్లో బట్టలు కుక్కి ఊపిరాడకుండా చేసి, ఇంట్లోని విలువైన బంగారంతో పారరయ్యారు. నేపాల్‌కు చెందిన ప్రధాన పని మనిషి కల్పన సహా మొత్తం ఏడుగురు సభ్యుల ముఠా ఈ దోపిడీ, హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. వెనువెంటనే ప్రత్యేక పోలీసు బృందాలు పలు నగరాల్లో విస్తృతంగా గాలించి పుణె (Pune), ముంబై (Mumbai)లలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితురాలు కల్పనతో పాటు ముంబైకి చెందిన వ్యాపారవేత్త దిలీప్, వాచ్‌మన్ సునీల్ పరియార్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.






