- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైక్లింగ్ కాలుష్య నియంత్రణకు దోహదం: జిల్లా కలెక్టర్
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే సైక్లింగ్‌ను ప్రజల్లో ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు.

దిశ, కామారెడ్డి: ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే సైక్లింగ్‌ను ప్రజల్లో ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. “హరిత భవిష్యత్తు కోసం సైక్లింగ్” అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వాహస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో ఫిట్ ఇండియా ఉద్యమం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సైక్లింగ్ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో సైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజంతో పాటు పచ్చని పర్యావరణాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రభుత్వ అధికారులు , వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా ఈ సైక్లింగ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్‌వీగిరి, డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో దామోదర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, క్రీడా సంఘాల సభ్యులు, యువత పాల్గొన్నారు.






