మూడు రోజుల్లోనే ఆ మైలురాయిని దాటిన ‘పెద్ది’.. నెక్స్ట్ టార్గెట్ అదేనా?

by Pulgam srinivas |   (  Updated:2026-06-07 06:46:09  IST  )

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.236.7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.

మూడు రోజుల్లోనే ఆ మైలురాయిని దాటిన ‘పెద్ది’.. నెక్స్ట్ టార్గెట్ అదేనా?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లను మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ రూ.236.7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 200 కోట్ల మార్క్‌ను దాటి, ఇప్పుడు 300 కోట్ల లక్ష్యంపై దూసుకెళ్తోంది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు లభిస్తున్న స్పందనను బట్టి చూస్తే నాలుగో రోజుకే ‘పెద్ది’ 300 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే పూర్తి రన్ ముగిసే నాటికి ఈ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ నిర్మించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

మహేష్‌తో మూవీపై సూపర్ అప్‌డేట్ ఇచ్చిన బుచ్చిబాబు.. జోనర్ కూడా ఫిక్స్

Next Story