మహేష్‌తో మూవీపై సూపర్ అప్‌డేట్ ఇచ్చిన బుచ్చిబాబు.. జోనర్ కూడా ఫిక్స్

by Pulgam srinivas |

మహేష్ బాబుకు ఇప్పటికే కథ చెప్పానని, ప్రస్తుతం ఆ దిశగా పనులు జరుగుతున్నాయని బుచ్చిబాబు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

మహేష్‌తో మూవీపై సూపర్ అప్‌డేట్ ఇచ్చిన బుచ్చిబాబు.. జోనర్ కూడా ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా, ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం ఆయన రామ్ చరణ్ హీరోగా ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఇక గత కొంతకాలంగా బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బుచ్చిబాబుకు, “మీ తదుపరి సినిమా మహేష్ బాబుతోనేనా?” అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి స్పందించిన ఆయన, “ఇప్పటికే మహేష్ బాబుకు ఒక కథ చెప్పాను. ప్రస్తుతం ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడే పూర్తి వివరాలు చెప్పలేను” అని సమాధానం ఇచ్చారు. అలాగే, “మీ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా ఆర్గానిక్ టచ్ ఉంటుందా?” అనే ప్రశ్నకు బుచ్చిబాబు, “ఇప్పుడే అది చెప్పలేను. కథకు అవసరమైతే అలాంటి అంశాలు వస్తాయి” అని తెలిపారు. ప్రస్తుతం మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story