- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైశాలి సరికొత్త రికార్డు.. ఆ ట్రోఫీ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర!
వైశాలీ సరికొత్త రికార్డ్ సృష్టించి జపాన్‌లో జరిగిన డబ్ల్యూఆర్ ఉమెన్స్ ర్యాపిడ్ చెస్ ట్రోఫీని కైవసం చేసుకున్న తొలి భారత క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు.

దిశ, వెబ్ డెస్క్: జపాన్ వేదికగా జరుగుతున్న చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో భారత ప్లేయర్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. భారత చదరంగ రంగంలో ప్రజ్ఞానంద, వైశాలీ తోబుట్టువుల జోడీ తమ సంచలన విజయాలతో దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తోంది. నార్వే చెస్ టైటిల్ గెలుచుకున్న తొలి ఇండియన్‌గా నిలిచి ప్రజ్ఞానంద సరికొత్త రికార్డ్ సృష్టించగా, ఇప్పుడు అదే బాటలో ఆయన సోదరి, గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి సరికొత్త చరిత్ర లిఖించారు. జపాన్ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరిగిన 'డబ్ల్యూఆర్ ఉమెన్స్ ర్యాపిడ్ చెస్ ట్రోఫీ' (WR Women’s Rapid Chess Trophy) ని కైవసం చేసుకున్న మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా ఆమె సరికొత్త రికార్డును నెలకొల్పారు.
ఫైనల్లో అద్భుత విజయం..
టోర్నమెంట్‌లో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన వైశాలీ.. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ రౌండ్‌లో కజకిస్థాన్‌కు చెందిన బలమైన క్రీడాకారిణి అలువా నూర్మన్‌ను 1.5-0.5 పాయింట్ల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ర్యాపిడ్ టైటిల్‌తో దేశాన్ని గర్వపడేలా చేసిన వైశాలీ.. నేటి నుంచి ప్రారంభం కానున్న 'బ్లిట్జ్ చెస్ ఈవెంట్' (Blitz Chess Event) లోనూ తన విజయ పరంపరను కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ ఈవెంట్‌లోనూ విజయం సాధించి డబుల్ టైటిల్ సొంతం చేసుకోవాలనే బలమైన లక్ష్యంతో ఆమె బరిలోకి దిగుతున్నారు.






