సాకేర గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

by Jakkula.Mamatha |

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నందు సోనాల మండలంలోని సాకేర(సూర్య నగర్)గ్రామంలో ఆదివారం ఉదయం విద్యుత్ షాక్‌తో ఓ బాలుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

సాకేర గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి
X

దిశ, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నందు సోనాల మండలంలోని సాకేర(సూర్య నగర్)గ్రామంలో ఆదివారం ఉదయం విద్యుత్ షాక్‌తో ఓ బాలుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాకేర గ్రామానికి చెందిన ఆడే అర్జున్, అరుణ దంపతుల కుమారుడు అయిన ఆడే ధీరజ్(6) ఇంట్లో ఉన్న కూలర్‌కు విద్యుత్ సరఫరా కావడంతో బాలుడికి విద్యుత్ షాక్ తగలడంతో వెంటనే కుటుంబ సభ్యులు బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్న వయసులో ధీరజ్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

Next Story