ముదిగొండలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన

by Jakkula.Mamatha |

ముదిగొండ మండలంలో ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు.

ముదిగొండలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
X

దిశ,ముదిగొండ: ముదిగొండ మండలంలో ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండల వ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్ర‌జా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేస్తూ, అభివృద్ధి పనులకు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ శ్రీకారం చుట్టారు. ఎడవల్లి లక్ష్మీపురం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (NREGS) నిధులతో సుమారు రూ.20 లక్షల రూపాయల నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించిన ఈ భవనం ద్వారా గ్రామ‌స్తుల‌కు ప‌రిపాల‌ల‌ను మరింత చేరువ అవుతుంద‌ని అన్నారు.

యడవల్లి గ్రామంలో నాణ్యమైన విద్యుత్ కోసం సబ్ స్టేషన్ రైతులకు, గృహ మరియు వాణిజ్య అవసరాలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ను అందించే దిశగా నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 3.15 కోట్ల వ్యయంతో ఈ సబ్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. మండల కేంద్రం ముదిగొండ లో ప్రజల సౌకర్యార్థం రూ. 25 లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఈఆర్వో (ERO) కార్యాలయానికి ఆయన శంకుస్థాప‌న చేశారు. ముదిగొండ మండల పరిధిలో రవాణా రంగాన్ని బలోపేతం చేసేందుకు, గ్రామీణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా పలు కీలక రహదారుల నిర్మాణ, విస్తరణ పనులకు డిప్యూటీ సీఎం కొబ్బరికాయ కొట్టారు. అందులో భాగంగా ఎడవల్లి నుంచి తల్లంపాడు వరకు రహదారి విస్తరణ పనులు. ఎడవల్లి నుంచి లక్ష్మీపురం మీదుగా తెల్దారుపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.రూ. 33 కోట్లతో జాతీయ రహదారుల అనుసంధానం ఈ పర్యటనలో అత్యంత కీలకమైన జాతీయ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఎన్.హెచ్ 365ఏ (కోదాడ-ఖమ్మం-కురివి), ఎన్.హెచ్ 365బీబీ (సూర్యాపేట-అశ్వారావుపేట) జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా రూ. 33 కోట్ల భారీ నిధులతో చేపట్టనున్న పనులకు ఆయన లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఈ రహదారుల అభివృద్ధితో ఈ ప్రాంత వాసుల రవాణా కష్టాలు శాశ్వతంగా తీరడమే కాకుండా, పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముదిగొండ మండల కేంద్రంలో 50 పడకలతో నిర్మిస్తున్న ఆసుపత్రి నిర్మాణ పనులను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులలో ఎక్కడ అలహాసన్ ప్రదర్శించరాదని అన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపూడి బుచ్చి రామయ్య నాయకులు మందరపు నాగేశ్వరావు, కందిమల్ల వీరబాబు, ఉసికల రమేష్, మల్లెల అజయ్, చెరుకుపల్లి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Next Story