- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిద్దాం : రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి
ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి “హ్యాపీ సండే “ కార్యక్రమం అవసరమని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.

దిశ, గోదావరిఖని : ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి “హ్యాపీ సండే “ కార్యక్రమం అవసరమని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత మార్చి నెలలో కూడా ఈ హ్యాపీ సండే కార్యక్రమాన్ని గోదావరి నది లో చెత్త ఏరి వేసిన తరువాత క్రీడా పోటీలు నిర్వహించి ఘనంగా చేపట్టడం జరిగిందని అన్నారు. డిజిటల్ స్క్రీన్స్ కు అలవాటు పడి శారీరక , మానసిక సామర్ధ్యాన్ని పెంచే యోగా , క్రీడలలో ప్రజలు భాగస్వాములు కాకపోవడం వలన రోగాల బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టు కోవాల్సిన దుస్థితి అలాగే అనేక ఇబ్బందులు పడే పరిస్థితి కూడా తలెత్తుతుందని అన్నారు. ఈ నేపధ్యంలో మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యం పై ఇప్పటికే కొంత మేర స్పృహ వచ్చిoదని నగరంలోని మైదానాలలో చాలా మంది కనిపిస్తున్నారని అన్నారు. ఇది శుభ పరిమాణమని అన్నారు.
మెప్మా సిబ్బంది సహకారంతో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక తో పాటు అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. రామగుండం నగరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దె ఎం ఎల్ ఎ ప్రయత్నం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య మాట్లాడుతూ అభివృద్ది , సంక్షేమo తో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ప్రదానమని ప్రభుత్వం తలచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ , నగర పాలక సంస్థ టి పి ఎస్ నవీన్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ , సీనియర్ అసిస్టెంట్ శ్రీ పాల్ , ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ , మెప్మా టి ఎం సి మౌనిక , యోగా గురు గణేష్, వ్యాయమ ఉపాధ్యాయులు శోభారాణి ,తిరుపతి,దావీద్ సి ఓ లు ఆర్ పి లు , సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా యోగాతో పాటు కబడ్డీ , మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు. పోటీలో విజేతలకు మెమెంటో , బహుమతుల ప్రదానం చేశారు.






