- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చదివిన చదువు ఒకటైతే.. డ్యూటీ చేసేది విద్యుత్ ఏఈ
చదివిన చదువు ఒకటైతే.. విధులు నిర్వహించేది విద్యుత్ ఏఈ. ఎన్పీడీసీఎల్ మీటింగ్ లో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు తమ దృష్టికి వచ్చిన విషయాన్ని విద్యుత్ భవన్ లో ఫిర్యాదు చేశారు.

దిశ, ఎల్లారెడ్డిపేట : చదివిన చదువు ఒకటైతే.. విధులు నిర్వహించేది విద్యుత్ ఏఈ. ఎన్పీడీసీఎల్ మీటింగ్ లో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు తమ దృష్టికి వచ్చిన విషయాన్ని విద్యుత్ భవన్ లో ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల సెస్ పరిధిలో ఉన్నప్పుడు చైర్మన్, పాలకవర్గం సభ్యులు గతంలో విద్యుత్ ఏఈ పోస్టుల విషయంలో సబ్జెక్టు కి సంబంధం లేని వ్యక్తుల వద్ద లక్షలాది రూపాయలు తీసుకొని పోస్టింగ్ లు ఇచ్చారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. చదువుకు సంబంధం లేకుండా ఏఈ పోస్టింగ్ చేస్తున్న వ్యక్తుల పేర్లతో NPDCL అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి ప్రస్తుతం సెస్ సంస్థలో ఏళ్లుగా డ్యూటీలు చేస్తున్న వారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయాలనే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. చదివిన చదువు ఒకటైతే ఏఈగా డ్యూటీ చేస్తున్నట్లు తేలితే వారు పని చేసిన కాలం నుంచి మొత్తం వేతనాలను రికవరీ చేయాలని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని NPDCL అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.






