ప్రెస్ క్లబ్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నిక..

by Kodari Anjali |   (  Updated:2026-06-07 10:01:12  IST  )

నకిరేకల్ పట్టణంలో ఈ నెల 3న నిర్వహించిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నల్లగొండ జిల్లా మూడవ మహాసభల్లో జిల్లా ప్రెస్ క్లబ్ కమిటీని ప్రకటించారు.

ప్రెస్ క్లబ్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నిక..
X

దిశ, కనగల్: నకిరేకల్ పట్టణంలో ఈ నెల 3న నిర్వహించిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నల్లగొండ జిల్లా మూడవ మహాసభల్లో జిల్లా ప్రెస్ క్లబ్ కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా కనగల్ మండలానికి ప్రాతినిధ్యం కల్పిస్తూ సీనియర్ పాత్రికేయుడు మల్లెపల్లి నరసింహను జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లెపల్లి నరసింహ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ, మండల కమిటీ సభ్యులు, సహచర పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా స్థాయిలో పాత్రికేయుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Next Story