- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'హైడ్రా ఫ్రమ్ హిట్లర్'.. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ ఎటాక్
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం జోరుగా సాగుతోంది. సందర్భం ఏదైనా సై అంటే సై అనేలా ఇరు పక్షాల మధ్య పొలిటికల్ క్రాకర్స్ పేలుతున్నాయి. హిట్లర్ స్ఫూర్తితోనే ‘హైడ్రా’ (HYDRA) ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హీట్ పెంచుతున్నాయి. సీఎం కామెంట్స్ పై బీఆర్ఎస్, బీజేపీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. రేవంత్ రెడ్డికి హిట్లర్ స్ఫూర్తి అని బీఆర్ఎస్ విమర్శిస్తే, హిట్లర్, తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి అని బీజేపీ విమర్శిస్తోంది. దీంతో ఇరు పార్టీల విమర్శలతో కూల్ మాన్‍సూన్‍లో పొలిటికల్ సెగలు రేగుతున్నాయి.
హిట్లర్‍కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి:
రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు.. హిట్లర్‍ను అనుసరిస్తున్న రేవంత్ రెడ్డికి కూడా హిట్లర్ కు పట్టిన గతే పడుతుందన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. కేంద్ర మంత్రులను పొలిమేర దాటనీయమంటున్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే మీరు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. మమ్మల్ని అడ్డుకోవడానికి మీరెవరు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ప్రజలు తరిమికొడతారన్నారు. ఇక బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హిట్లర, తుగ్లక్ కలిపితే రేవంత్ రెడ్డి అని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డే సోనియా గాంధీ కుటుంబానికి గులాంగిరీ చేస్తున్నారని మండిపడ్డారు. అనుకోకుండా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తొక్కుకుంటూ వచ్చానని మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇకనైనా జోకర్ మాటలు మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మీ మైండ్ సెట్ మరోసారి బహిర్గతమైంది: కిషన్ రెడ్డి
సీఎం వ్యాఖ్యలపై ఎక్స్ వేదికాగ స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రమాదకరమైన హిట్లర్, ఎమర్జెన్సీ మైండ్‌సెట్ మరోసారి బహిర్గతమైందన్నారు. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలలో జరిగే విధ్వంసాలతో హైదరాబాద్‌లోని కూల్చివేతలను పోలుస్తూ.. తన నాయకుడు రాహుల్ గాంధీ భాషనే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారన్నారు. హిట్లర్ స్ఫూర్తితోనే తాను 'హైడ్రా' (HYDRAA)ను ఏర్పాటు చేశానని ఆయన ఇప్పుడు బహిరంగంగానే గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎమర్జెన్సీ రోజుల నుండి హిట్లర్ దాకా – కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల గొంతు నొక్కడానికే ప్రయత్నించిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి, తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ విషయం ప్రజలకు ముందే తెలుసు:కేటీఆర్
రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ నీ స్ఫూర్తి హిట్లర్! నీ హత్యల సంస్థ హైడ్రా (Hydraa) అని సెటైర్ వేశారు. నువ్వు పాలకులని/డిక్టేటర్లను పూజిస్తావుని కూల్చివేతల గురించి గొప్పలు చెప్పుకుంటావని అన్నారు. నిజమే రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజలకు ఈ విషయం ముందే తెలుసు. ఇప్పుడు దేశం మొత్తానికి దీనిపై క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు. మేము నీ అంత తెలివైన వాళ్లం కాదేమో.. అందుకే మేము మా పరిపాలనను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగానికి, మహాత్మా గాంధీ గారి ఆశయాలకు, ప్రొఫెసర్ జయశంకర్ కలలకు అనుగుణంగా మలచుకుంటే మీరు హిట్లర్ ఆదర్శంగా నడుచుకుంటున్నారని విమర్శించారు.






