మాస్కో అణుశక్తి మ్యూజియంను సందర్శించిన మంత్రి లోకేశ్

by Vemula.Srinu Prasad |

రష్యా రాజధాని మాస్కోలోని ప్రపంచ ప్రసిద్ధ అణుశక్తి మ్యూజియంను ఏపీ మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ..

మాస్కో అణుశక్తి మ్యూజియంను సందర్శించిన మంత్రి లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: రష్యా రాజధాని మాస్కో(Russia Capital Moscow)లోని ప్రపంచ ప్రసిద్ధ అణుశక్తి మ్యూజియంను(Atomic Energy Museum) ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) సందర్శించారు. రష్యాలోనే అత్యంత పెద్దదైన ఈ మ్యూజియం సుమారు 25 వేల చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో 7 అంతస్తులతో అద్భుతంగా నిర్మితమైంది. సోవియట్ కాలం నాటి తొలి అణు ప్రాజెక్ట్ విశేషాల నుంచి నేటి ఆధునిక అణుశక్తి సాంకేతికత, భవిష్యత్తులో రాబోయే శాస్త్రీయ ఆవిష్కరణల వరకు మానవాళి సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా ఇక్కడి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.

ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్‌కు అక్కడి విశేషాలను కూలంకషంగా మ్యూజియం నిర్వాహకులు వివరించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల నుంచి సుమారు 35 లక్షల మందికి పైగా సందర్శకులు ఈ అణుశక్తి కేంద్రాన్ని సందర్శించారని తెలియజేశారు. అణు సాంకేతికత రంగంలో సాధించిన అద్భుతాలను, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ మ్యూజియం పర్యటన ద్వారా మంత్రి లోకేష్ స్వయంగా పరిశీలించారు.

Next Story