- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మట్టిలో ఇరుక్కుపోయిన బస్సు.. 10 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) ప్రమాదవశాత్తు ఘాట్ రోడ్డులోని ఒక మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న మట్టిలో ఇరుక్కుపోయింది. ..

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project) సమీపంలోని ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic jam) అయింది. హైదరాబాద్(Private Travels Bus) నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) ప్రమాదవశాత్తు ఘాట్ రోడ్డులోని ఒక మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న మట్టిలో ఇరుక్కుపోయింది. బస్సు కదలకుండా రోడ్డుకు అడ్డంగా ఉండిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్
ఈ ప్రమాదం కారణంగా డ్యామ్ దాటి అటు దోమలపెంట చెక్‌పోస్ట్ వరకు, ఇటు సున్నిపెంట వరకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం, ఘాట్ రోడ్డు కావడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి ప్రయాణం నరకప్రాయంగా మారింది.
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణకు చర్యలు
ప్రస్తుతం మట్టిలో ఇరుక్కుపోయిన బస్సును సురక్షితంగా బయటకు తీసేందుకు స్థానికులు, తోటి ప్రయాణికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి, బస్సును పక్కకు తొలగించి మార్గాన్ని పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని లేదా కాస్త ఓపిక పట్టాలని అధికారులు సూచిస్తున్నారు.






