- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా తరలివచ్చారు...

దిశ, ఏపీ బ్యూరో: ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ అధికారులు డీఈఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏఈవోలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్ క్యూలైన్లను సమర్థవంతంగా నిర్వహించారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. దీంతో సామాన్య భక్తులకు వేగవంతమైన దర్శనం చేసుకున్నారు.
క్యూ లైన్లలోనే..
వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలోనే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీరు అందించారు. ఈ సరికొత్త విధానానికి భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. అలాగే ఉచిత ప్రసాదం, అన్నదానం నిరంతరంగా కొనసాగించారు. మధ్యాహ్నం తర్వాత రద్దీ క్రమంగా తగ్గగా, ధర్మకర్తల మండలి సభ్యులు స్వయంగా క్యూ లైన్లను పరిశీలించి భక్తుల సౌకర్యాలను సమీక్షించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో భారీ రద్దీ ఉన్నప్పటికీ దర్శనం సాఫీగా జరిగిందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.






