- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయాలు ఎన్నికల వరకే.. అభివృద్ధి నిరంతర ప్రక్రియ : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అవ్వాలని, అభివృద్ధి మాత్రం నిరంతరం కొనసాగుతుంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.

దిశ, జగిత్యాల టౌన్ : రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అవ్వాలని, అభివృద్ధి మాత్రం నిరంతరం కొనసాగుతుంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగిత్యాలకు అధిక నిధులు కేటాయింపున విషయంలో సానుకూలంగా ఉన్నారని తెలిపారు. జగిత్యాల ఇప్పుడొక విద్యా, వైద్యం హబ్ గా మారినట్లు పేర్కొన్నారు. రూ. 235 కోట్లతో నూతన ఆసుపత్రి నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజల సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అలాగే కొంతమంది నాయకులు కావాలని అసత్య ప్రచారాలు చేసేంత మాత్రాన ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, ఆత్మ చైర్మన్ తాటిపల్లి గంగారెడ్డి, డిఇ మిలింద్, ఎంపీ ఓ రవిబాబు, సర్పంచ్ నోముల రమ్య, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.






