- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంబరాలు ప్రభుత్వానివి... సంకటాలు ప్రజలవి: భూమన
by Vemula.Srinu Prasad |
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏమి మేలు చేసిందని సంబరాలు చేసుకుంటోందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు...

X
దిశ, ఏపీ బ్యూరో: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏమి మేలు చేసిందని సంబరాలు చేసుకుంటోందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, సంతృప్తి లేదని ఆయన ఆరోపించారు. ఈ 730 రోజుల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ఘోరాలు జరిగాయని ప్రజలు చర్చించుకుంటున్నారని భూమన అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చ లేదని, అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని భూమన ఆరోపించారు.
Next Story






