- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ క్యాబిన్‌లో ఉరివేసుకుని డ్రైవర్ ఆత్మహత్య..
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్ కరణం భరత్ కుమార్ (52) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన ఎర్రుపాలెం గ్రామంలో జరిగింది.

దిశ, ఎర్రుపాలెం: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్ కరణం భరత్ కుమార్ (52) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన ఎర్రుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఎర్రుపాలెం గ్రామంలోని గణపతి వేబ్రిడ్జి వెనుక భాగంలో నిలిపి ఉంచిన లారీ క్యాబిన్‌కు తాడు కట్టి ఉరివేసుకున్న స్థితిలో ఆయన మృతదేహం కనిపించింది. ఎస్సై రమేష్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు కరణం భరత్ కుమార్ జామాయిల్ పొట్టు లోడింగ్ కోసం ఎర్రుపాలెంకు వచ్చారు. ఉదయం అక్కడికి వచ్చిన జేసీబీ డ్రైవర్ లారీ క్యాబిన్‌లో మృతదేహాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించాడు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుమారుడు కరణం షణ్ముఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరణం భరత్ కుమార్‌కు భార్య, వివాహిత కుమార్తె, కుమారుడు ఉన్నారు.






