ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

by Batti.Sumithra |

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, బడంగ్ పేట్ : ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం బడంగ్ పేట్ సర్కిల్, నాదర్ గుల్ డివిజన్ పరిధిలోని శేషాద్రి నగర్ కాలనీలో 87 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడంగ పేట్ సర్కిల్ పరిధిలో ప్రతి కాలనీ దశలవారీగా అభివృద్ధి చేసి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీను నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నామని అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ పడబోమని ఆమె తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా చూడాలని ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి అందరి లక్ష్యంగా ఉండాలని ఆమె అన్నారు. సీసీ రోడ్డు పనులలో నాణ్యతను పాటించి నిర్ణీత గడువులోపు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కాలనీలలో ముప్పు సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థలను పట్టించపరచాలని చెత్తాచెదారం లేకుండా పూడికను తొలగించి నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటకం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ హరీష్, డీఈ హరిణి, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు సమ్ రెడ్డి వెంకట్ రెడ్డి, బడంగ్ పేట్ మాజీ అధ్యక్షుడు రామిడి రామ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story