- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్సుల డ్రెస్సింగ్‌పై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
భారతదేశంలో నర్సుల డ్రెస్సింగ్ పై బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సుల యూనిఫాం ఇప్పటికీ బలమైన వలసవాద ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని కంగనా అభిప్రాయపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో నర్సుల డ్రెస్సింగ్ పై బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సుల యూనిఫాం ఇప్పటికీ బలమైన వలసవాద ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని కంగనా అభిప్రాయపడ్డారు. తన రాబోయే సినిమా నర్సింగ్ వృత్తి, దాని ప్రాతినిధ్యం గుర్తించి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం డాక్టర్లు తమకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ నర్సులు మాత్రం కఠినమైన, సాంప్రదాయ యూనిఫాంను వేసుకుంటూనే ఉన్నారని చెప్పారు. కాబట్టి భవిష్యత్ లో నర్సుల సౌకర్యం, ప్రాధాన్యతలకు అనుగుణంగా యూనిఫాం మార్చవచ్చని స్పష్టం చేశారు. బ్రిటిష్ నర్సుల డ్రెస్ కోడ్ ఇప్పటికీ వాడుకలో ఉందని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.
యూనిఫాంపై పిన్ను, టోపీ లేదా బెల్టు పెట్టుకోవడం అమెరికా నేవీలో ఉంటుందని అన్నారు. మొదటి, రెండవ ప్రపంచ యద్దాల్లో వాళ్లు అలానే కనిపిస్తారని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా వాతావరణం వేడిగా ఉన్నా చల్లగా ఉన్న నర్సులు అదే యూనిఫాం ధరించాలని, వాటివల్ల విదేశీయుల్లా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని, యూనిఫాం డిజైన్, సైజ్ ముఖ్యం కాదని.. మీ యూనిఫామే మీ విధి అని వ్యాఖ్యానించారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కంగనా రనౌత్ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీలోనే ఉన్నారు. దీంతో కంగనా ప్రతిపాధనను కేంద్రం పట్టించుకుంటే నర్సుల యూనిఫామే మారిపోయే అవకాశాలు ఉన్నాయి.






