గున్మ‌క్ల గుట్ట పై మ‌రోమారు మైనింగ్ త‌వ్వ‌కాల‌పై మొద‌లైన ఆందోళ‌న‌

by Nallavelli.Anjaneyulu |

ఆనాడు పార్టీలు ఏకమయ్యాయి. ప్రజా సంఘాల ముందుకు వచ్చాయి. మా గ్రామాలను కాపాడుకుంటాం. మైనింగ్ అనుమతులకు ఎట్టి పరిస్థితులు అనుమతిని అడ్డుకొని ప్రాణాలైనా అర్పిస్తాం.

గున్మ‌క్ల గుట్ట పై మ‌రోమారు మైనింగ్ త‌వ్వ‌కాల‌పై మొద‌లైన ఆందోళ‌న‌
X

దిశ, ధన్వాడ : ఆనాడు పార్టీలు ఏకమయ్యాయి. ప్రజా సంఘాల ముందుకు వచ్చాయి. మా గ్రామాలను కాపాడుకుంటాం. మైనింగ్ అనుమతులకు ఎట్టి పరిస్థితులు అనుమతిని అడ్డుకొని ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ మైనింగ్ ను మాత్రం ఆపుతామంటూ నేడు అధికారంలో ఉన్న నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు ఆనాడు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఎక్కడో కాదు ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామంలో చోటుచేసుకుంది. గున్ముక్ల గుట్టపై 144 సర్వే నెంబర్ లో దాదాపు 50 ఎకరాలకు పైగా ఉన్న గుట్టపై మైనింగ్ తవ్వకాల కోసం ఆనాడు ప్రయత్నాలు చేశారు కలెక్టర్ వచ్చారు. జిల్లా ఉన్నత అధికారులు వచ్చారు. ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. మూడు గ్రామాల ప్రజల సమక్షంలో ప్రజాభిప్రాయల సేకరణ చేశారు. ఈ సేకరణలో అఖిలపక్ష నాయకులు పాల్గొని మైనింగ్ వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ పాల్గొన్నారు పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ లో అందరు వ్యతిరేకించడంతో అధికారులు సైతం పరిస్థితి ఇబ్బందిగా ఉంటుందంటూ మైనింగ్ కు అనుమతులు ఇవ్వలేదు. ఇదంతా మూడేళ్ల క్రితం జరిగిన ఈ సమస్యను మళ్ళీ తెరపైకి తెచ్చారు.


ప్రస్తుతం మైనింగ్ తవ్వకాలకు అనుమతులు వచ్చాయి అంటూ గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మైనింగ్ చేపట్టే గుట్టపై దాదాపు నాలుగు కోట్ల పైగా ప్రభుత్వ అభివృద్ధి పనులు జరిగాయి ఒకవేళ మైనింగ్ కొనసాగితే నాలుగు కోట్లతో పాటు మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఏర్పాటు చేసిందంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు పర్యావరణం దెబ్బతినడమే కాక చెరువు వన్యప్రాణుల జీవన మనుగడ.. పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం ఉందంటూ ప్రజలు భయపడిపోతున్నారు. మైనింగ్ కు ఎట్టి పరిస్థితిలో అనుమతులు ఇవ్వరాదు అంటూ ఈ మూడు గ్రామాల ప్రజలు అప్పటి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కలెక్టర్ కు వినతి పత్రాలు ఉంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ గుట్టపై మైనింగ్ కు అనుమతులు వచ్చాయి మీరు ఎవరు అడ్డుకునే పరిస్థితి ఉండరాదు అంటూ గత రెండు రోజుల క్రితం పోలీస్ శాఖ వారు పలువురు నాయకులను పిలిపించి హెచ్చరికలు జారీ చేసినట్లుగా సమాచారం.

దీంతో ఈ గ్రామాల్లో ఆందోళన మొదలై ఇటీవల బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మైనింగ్ కొనసాగితే అడ్డుకుంటామని.. ఎంత పోరాటానికైనా సిద్ధమంటూ ఆ పార్టీ నాయకులు సుధీర్ కుమార్ శివారెడ్డి మల్లేష్ సచిన్ శాంతి కుమార్ నరసింహారెడ్డి నరసింహులు తో పాటు పలువురు హెచ్చరించారు. మైనింగ్ తవ్వకాలు జరుగుతే భూగర్భ జలాలు దెబ్బ తినడమే కాక జీవనోపాధిక సైతం ఇబ్బందిగా మారి వలసలు జరిగే ప్రమాదం ఉందంటూ ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ చర్యను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలంటూ చర్చ మొదలైంది. ఏదేమైనప్పటికీ నాడు చేసిన ఆందోళనలతో అయిపోయింది అనుకున్న మైనింగ్ తవ్వకాలకు మరోసారి అనుమతులు ఇచ్చి ఇక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేసే ప్రమాదం నెలకొంది. గుట్టపై వైకుంఠధామం.. నర్సరీ, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక నిర్మాణాలను పూర్తి చేశారు ఇక్కడ మైనింగ్ ప్రారంభమైతే ప్రభుత్వ నిధులతో నిర్మించిన అభివృద్ధి పనులు సైతం బూడిదలో పోసిన పన్నీరు తయారయ్యే పరిస్థితి ఏర్పడింది.

మైనింగ్ కు అనుమతులు ఇవ్వద్దంటూ తీర్మానం చేశాం

గున్ము క్ల గుట్టపై మైనింగ్ అనుమతులు వివరాలు అంటూ మా గ్రామంతో పాటు మంత్రోన్ పల్లి, గున్ము క్ల గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం జరిగింది. మూడు గ్రామాల ప్రజలు వ్యతిరేకించిన మళ్లీ మైనింగ్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే అడ్డుకోవడం తప్పదు.

మైనింగ్ అనుమతులు ఇస్తే ఊరుకునేది లేదు : ప్రవీణ్ కుమార్ రెడ్డి

గున్ము క్ల గుట్టపై మైనింగ్ అనుమతులకు ప్రభుత్వం అనుమతిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. నాడు ప్రజాభిప్రాయ సేకరణలో వ్యతిరేకించడం జరిగింది. కలెక్టర్ సమక్షంలో ప్రజలందరూ ముక్తకంఠంతో మైనింగ్ అనుమతులను వ్యతిరేకించారు మళ్లీ మైనింగ్ సమస్య తెరపైకి వస్తే ఊరుకునేది లేదు-

Next Story