వర్షాలు సంతృప్తిగా పడాలని రామాలయంలో ముడుపు విప్పిన రైతులు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-07 12:37:44  IST  )

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాకతీయుల కాలం నాటి సీతారామస్వామి ఆలయంలో గ్రామ రైతులందరూ కలిసి అకాల వర్షాలు, వడగండ్ల వానలు పడకూడదు అని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సమయంలో అందరి సమక్షంలో స్వామివారికి ముడుపు వేయడం జరిగింది.

వర్షాలు సంతృప్తిగా  పడాలని రామాలయంలో ముడుపు విప్పిన రైతులు
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాకతీయుల కాలం నాటి సీతారామస్వామి ఆలయంలో గ్రామ రైతులందరూ కలిసి అకాల వర్షాలు, వడగండ్ల వానలు పడకూడదు అని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సమయంలో అందరి సమక్షంలో స్వామివారికి ముడుపు వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రైతులకు ఏటువంటి నష్టం జరగకుండా కాపాడిందని రైతుల నమ్మకం, మండలంలో అన్ని గ్రామాల్లో వర్షాలు పడగాని మండల కేంద్రంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క చినుకు కూడా పడలేదు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ప్రతి ఒక్క రైతు పంటలు పుష్కలంగా పండి సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రోహిణి కార్తె ప్రారంభం అయినందున వర్షాకాలం పుష్కలంగా వర్షాలు పడి పంటలు మంచిగా పండటం కోసం అప్పుడు వేసిన ముడుపును ఆదివారం విప్పి సీతారామచంద్రస్వామి వారిని గ్రామ పురవీధుల గుండా గరుడ సేవపై ఊరేగింపు చేశారు. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం పూజారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story