- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైనేజీ దుర్గంధంతో 12 కాలనీల విల విల
డ్రైనేజీ, కెమికల్ వ్యర్థ జలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మన్సూరాబాద్ పరిధిలోని 12 కాలనీల వాసులు ఆదివారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.

దిశ, వనస్థలిపురం: డ్రైనేజీ, కెమికల్ వ్యర్థ జలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మన్సూరాబాద్ పరిధిలోని 12 కాలనీల వాసులు ఆదివారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. కాలనీల్లోకి వర్షపు నీటి కాలువల ద్వారా డ్రైనేజీ నీరు, ఆటోనగర్ ప్రాంతం నుంచి వస్తున్న కెమికల్ వ్యర్థ జలాలు చేరి రోడ్లపై ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భారీ సంఖ్యలో స్థానికులు నిరసనకు దిగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని కాలనీవాసులు ఆరోపించారు. వేసవిలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వర్షాకాలంలో మరింత తీవ్ర సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వరద కాలువల్లో ప్రవహిస్తున్న డ్రైనేజీ, కెమికల్ జలాల వల్ల తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోందని, దీంతో చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. వర్షపు నీటి కాలువలను కేవలం వర్షపు నీటి పారుదలకే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ, కెమికల్ వ్యర్థ జలాలకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.






