బీర్కూర్ మండల కేంద్రంలో సైబర్ మోసం..

by Taduka Kalyani |

బీర్కూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.95,100 కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది.

బీర్కూర్ మండల కేంద్రంలో సైబర్ మోసం..
X

దిశ, బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.95,100 కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు మజ్హర్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం వాట్సాప్‌లో వచ్చిన ఆర్టీఏ ఈ-చలాన్ పేరుతో ఉన్న ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేశాడు. ఆ సమయంలో అతని బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో ఎలాంటి అనుమానం రాలేదు. అయితే ఇటీవల ఖాతాలో డబ్బులు జమ అయిన వెంటనే మొత్తం రూ.95,100 గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్ ద్వారా కాజేశారు. డబ్బులు డెబిట్ అయినట్లు మొబైల్‌కు సందేశం రావడంతో బాధితుడు తన బ్యాంకు ఖాతాను పరిశీలించగా మోసానికి గురైనట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు బీర్కూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ.. వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని, గుర్తు తెలియని లింకులు లేదా యాప్‌లను ఓపెన్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Next Story