- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనీషా లక్ష్మీ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిక..
ఏన్కూర్ మండలంలో పలు గ్రామాల్లో వైరా మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బానోతు మదన్ లాల్ కుమార్తె బానోతు మనీషా లక్ష్మీ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు.

దిశ, ఏన్కూర్: మండలంలో నాచారం కాలనీ నాచారం కేసు పల్లి తదితర గ్రామాలలో వైరా మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బానోతు మదన్ లాల్ కుమార్తె బానోతు మనీషా లక్ష్మి ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కాలనీ నాచారం గ్రామంలో మనిషా లక్ష్మీ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మనీషా లక్ష్మి గులాబీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైరా నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి, పనిచేసిన తన తండ్రి బానోతు మదన్ లాల్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని మనీషా లక్ష్మీ కార్యకర్తలకు తెలియజేశారు. వైరా నియోజకవర్గ అభివృద్ధి చెందిన గ్రామాలు తన తండ్రి బానోత్ మదన లాల్ ను మర్చిపోరని, ఆయనకు వైరా నియోజకవర్గ అంటే ఎంతో అభిమానం అని ఆయనను అభిమానించే ప్రతి కార్యకర్త తనను స్వాగతిస్తారని ఆ నమ్మకం తనకు ఉందని తెలిపారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను మీ వెంట ఎల్లప్పుడూ ఉంటానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఆమె వెంట పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.






