- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధిత కుటుంబానికి అండగా మంత్రి అడ్లూరి
రాజరాంపల్లి వద్ద రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ముని లత కుటుంబానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిఅన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

దిశ, వెల్గటూర్ : రాజరాంపల్లి వద్ద రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ముని లత కుటుంబానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిఅన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన ముని లత ఇటీవల రాజారాం పల్లి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ ఢీ కొట్టగా మృతి చెందింది. సమాచారం అందుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మృతురాలు కుటుంబాన్ని ఆదివారం చర్లపల్లి లో పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.10వేల ఆర్థిక సహాయం అందించారు. మునిలత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు గెల్లుశేఖర్, గ్రామ సర్పంచ్ పడిదం లావణ్య మొగిలి, ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ పత్తిపాక శ్రీధర్ పాల్గొన్నారు.






