- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడలో తాగుబోతుల బీభత్సం.. కానిస్టేబుల్, ఆటో డ్రైవర్‌పై దాడి
విజయవాడలో మందు బాబులు బీభత్సం సృష్టించారు. ఇద్దరు తాగుబోతులు అర్ధరాత్రి థార్ కారుతో ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తూ రోడ్డుపై హల్ చల్ చేశారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ వారిని ప్రశ్నించగా అతడిపై దాడి చేశారు.

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో మందు బాబులు బీభత్సం సృష్టించారు. ఇద్దరు తాగుబోతులు అర్ధరాత్రి థార్ కారుతో ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తూ రోడ్డుపై హల్ చల్ చేశారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ వారిని ప్రశ్నించగా అతడిపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై బరితెగించి దాడికి పాల్పడ్డారు. సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పటమట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని చిట్టినగర్ కు చెందిన వారిగా గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం మందుబాబుల వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో మందుబాబులు అసలు నిలబడేందుకు కూడా ఓపిక లేక కిందపడిపోతూ, తూలుతూ కనిపిస్తున్నారు. కనీసం చొక్కాలు కూడా లేకుండా రోడ్డుపై పడిపోయారు. ఇక ఇటీవలే విజయవాడులో ఇద్దరు యువకులు థార్ జీపులతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఒక యువతి కోసం ఇద్దరు యువకుడు రోడ్డుపై థార్ లతో ఒకరినొకరు ఢీ కొడుతూ రెచ్చిపోయారు. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు మరోసారి విజయవాడలో మందుబాబులు హల్ చల్ చేయడంతో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.






