స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం..

by Kodari Anjali |

స్నేహితుడు మృతి చెందడంతో అతని బాల్య మిత్రులు ఆదివారం ఆయన కుటుంబానికి 69,000 ఆర్థిక సహకారం అందజేశారు.

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం..
X

దిశ, చిట్యాల: తమతో పాటు కలిసి చదువుకున్న స్నేహితుడు మృతి చెందడంతో అతని బాల్య మిత్రులు ఆదివారం ఆయన కుటుంబానికి 69,000 ఆర్థిక సహకారం అందజేశారు. 1989 -90 లో పెద్ద కాపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి కలిసి చదువుకున్న చిన్న కాపర్తి వాస్తవ్యుడు లోడే విష్ణుమూర్తి ఇటీవల అనారోగ్యం కారణం చేత మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని స్నేహితులు ఆదివారం అతని ఇంటికి వెళ్లి అతని చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భవిష్యత్తులో ఎలాంటి సహకారం చేయడానికైనా ముందుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుంగపట్ల తిమ్మయ్య, కేశని సత్తిరెడ్డి, గురిజ జంగయ్య, కంచర్ల వెంకటరెడ్డి, నారాయణ ఆనంద్, నారాయణ ప్రసాద్, గంట్ల శ్రీనివాస్ రెడ్డి, మారగొని యాదగిరి, మామిడి లక్ష్మీనారాయణ, నారబోయిన శ్రీను, నకరికంటే కృష్ణ, నరసింహ, కోనూరు యాదగిరి, వడ్డేపల్లి మంగమ్మ, ఉప్పరపోయిన ఇందిరమ్మ, పొట్లపల్లి పద్మ, కోమటిరెడ్డి మంజుల తదితరులు పాల్గొన్నారు.

Next Story