భూపాలపల్లి జిల్లాలో భారీ ఎత్తున నిషేధిత అంబర్ గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

by Nallavelli.Anjaneyulu |

భూపాల్ పల్లి జిల్లా కాశీంపల్లిలో పెద్ద ఎత్తున నిషేధిత అంబర్ పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భూపాలపల్లి జిల్లాలో భారీ ఎత్తున నిషేధిత  అంబర్ గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: భూపాల్ పల్లి జిల్లా కాశీంపల్లిలో పెద్ద ఎత్తున నిషేధిత అంబర్ పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఆదేశాల మేరకు, సీసీఎస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులపై నిర్వహించిన తనిఖీలలో భాగంగా భూపాలపల్లి మండలం ఖాసింపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్ (36) వద్ద నుంచి అంబర్ (అనార్ బ్రాండ్) గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 6 సంచుల్లో, ఒక్కో సంచిలో 200 ప్యాకెట్ల చొప్పున మొత్తం 1,200 ప్యాకెట్లు లభించగా, వాటి విలువ సుమారు రూ.1,92,000/-గాపేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అభిప్రాయం పొందిన అనంతరం, నిందితుడిని స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ ఉంచడం, రవాణా చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Next Story