ప్రీ ప్రైమరీ పాఠశాల ఇన్ స్ట్రక్టర్ ఆయా పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం

by Batti.Sumithra |

ఫరూఖ్ నగర్ మండలంలోని ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఇన్ స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ఫరూఖ్ నగర్ ఎంఈఓ మనోహర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రీ ప్రైమరీ పాఠశాల ఇన్ స్ట్రక్టర్ ఆయా పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం
X

దిశ, షాద్ నగర్ : ఫరూఖ్ నగర్ మండలంలోని ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఇన్ స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ఫరూఖ్ నగర్ ఎంఈఓ మనోహర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని పీఎస్ వెలిజర్ల, మున్సిపాలిటీలోని పీఎస్ రాంనగర్, పీఎస్ క్రిస్టియన్ కాలనీ, పీఎస్ ఆర్టీసీ కాలనీ, పీఎస్ వెంకటేశ్వర కాలనీలలో 2026 _ 27 విద్యా సంవత్సరంకు గాను ఐదు పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరయ్యాయని తెలిపారు. ఇన్ స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టుకు ఏడవ తరగతి అర్హత నిర్ణయించారని పేర్కొన్నారు. ఇన్ స్ట్రక్టర్ పోస్టులకు టీచర్ ట్రైనింగ్ పూర్తిచేసిన డీఎల్ఎడ్, డీఈడీ పూర్తి చేసిన, స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోపు ఫరూఖ్ నగర్ మండల విద్యావనరుల కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 96035 54546 నెంబర్ ను సంప్రదించాలని ఎంఈఓ మనోహర్ పేర్కొన్నారు.

Next Story