- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీరన్నగుట్టను దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం
స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ, కాలనీ సంఘాల సహకారంతో వీరన్నగుట్టను అద్భుతమైన దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హామీ ఇచ్చారు.

దిశ, వనస్థలిపురం: స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ, కాలనీ సంఘాల సహకారంతో వీరన్నగుట్టను అద్భుతమైన దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట భద్రకాళి రామలింగేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధి పనులు, కాలనీల సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ యువ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 10 నుంచి 12 కాలనీల ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొని ఆలయాభివృద్ధి, మౌలిక వసతులపై అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన వెంటనే రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. వీరన్నగుట్ట క్షేత్రం ఆధ్యాత్మికంగా విశిష్ట ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రమని, గతంలో ఆలయ అభివృద్ధికి రూ.18 కోట్లు మంజూరు చేయించామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, పలువురు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.






