2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. ఎన్నిరోజులు సెలవులంటే?

by Muthe.Rajitha |

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. ఎన్నిరోజులు సెలవులంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త క్యాలెండర్ ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మొత్తం 227 పనిదినాలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. అలాగే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28, 2027 లోగ సిలబస్ మొత్తాన్ని పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పండుగ సెలవుల విషయానికి వస్తే, విద్యార్థులకు ఈ ఏడాది కూడా దసరా పండుగకు సుదీర్ఘ సెలవులు లభించనున్నాయి. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులను ప్రకటించారు. సంక్రాంతికి మాత్రం జనవరి 13 నుంచి జనవరి 17 వరకు 5 రోజుల పాటు సెలవులు ఉంటాయని క్యాలెండర్‌లో పేర్కొన్నారు.

ఈ విద్యా సంవత్సరం ముగింపు, వేసవి సెలవుల వివరాలను కూడా విద్యాశాఖ ముందే ఖరారు చేసింది. 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 23 చివరి వర్కింగ్ డే కానుంది. ఆ మరుసటి రోజు నుంచే, అంటే ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు (Summer Holidays) ఉంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. కాగా ఈ క్యాలెండర్ అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్ పాఠశాలలకు వర్తిస్తుందని పేర్కొంటూ.. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Next Story